ముంబై : పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఓ యువతిని మోసం చేశాడని ప్రముఖ బాలీవుడ్ నటి బాడీగార్డుపై కేసు నమోదైంది. ముంబై నగరంలోని అథేరీ ప్రాంతంలోని ఈ ఘటన జరిగింది. ప్రముఖ బాలీవుడ్ నటి వద్ద బాడీగార్డు పనిచేసే వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ. 50 వేలు తీసుకొని తనపై లైంగిక దాడి చేశాడని ఓ బ్యుటీషియన్ అథేరీ పరిధిలోని డీఎస్ నగర్ పోలీసులకు ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిపై ఐపీసీ 376 (లైంగిక దాడి ఆరోపణ), 420 (చీటింగ్) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కేసుపై విచారణ జరుపుతున్నామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.