ఆదివారం 12 జూలై 2020
National - Jun 14, 2020 , 17:57:18

ముంబై బందోబస్తులో ఎలక్ట్రిక్‌ స్కూటర్లు

ముంబై బందోబస్తులో ఎలక్ట్రిక్‌ స్కూటర్లు

ముంబై: మహారాష్ట్రలో శాంతి, భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. మహారాష్ట్ర పోలీసుల బలగాల ఆధునీకరణపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. ప్రపంచ ప్రమాణాలతో సమానంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

అందులో భాగంగా చిన్నచిన్న గల్లీల్లో కూడా పోలీసులు వెళ్లేందుకు వీలుగా సెగ్వే ఎలక్ట్రిక్‌ స్కూటర్లను అందుబాటులోకి తెచ్చారు. ముంబైలో ముఖ్యంగా దక్షిణ ముంబైలోని సముద్రతీర ప్రాంతంలో పెట్రోలింగ్‌ చేపట్టడం పోలీసులకు కత్తిమీది సాముగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 50 సెగ్వే ఎలక్ట్రిక్ స్కూటర్లను పోలీసులకు అప్పగించినట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ చెప్పారు. ప్రస్తుతం సెగ్వే ఎలక్ట్రిక్‌ స్కూటర్లతో ముంబైలోని దక్షిణ ప్రాంతంలో పెట్రోలింగ్‌ ప్రారంభించగా.. త్వరలో బాంద్రా, జుహూ, వెర్సోవా వంటి ప్రాంతాల్లో కూడా చేపట్టాలని నిర్ణయించారు. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు ఆమర్చిన మైకుల ద్వారా పోలీసులు ప్రజలకు సూచనలు ఇస్తారు. logo