ఆదివారం 17 జనవరి 2021
National - Dec 18, 2020 , 14:50:37

దూరప్రాంత ప్రయాణికులకు లోకల్‌ ట్రైన్స్‌లో వెసులుబాటు

దూరప్రాంత ప్రయాణికులకు లోకల్‌ ట్రైన్స్‌లో వెసులుబాటు

ముంబై: దూర ప్రాంత ప్రయాణికులు ముంబైలోని ప్రధాన రైల్వే స్టేషన్‌కు చేరేందుకు లోకల్‌ ట్రైన్స్‌లో ప్రయాణించవచ్చు. అలాగే సుదూర ప్రాంతాల నుంచి రైళ్లలో నగరానికి వచ్చిన వారు తమ గమ్యస్థానాలకు లోకల్‌ ట్రైన్స్‌లో చేరవచ్చు. ప్రయాణ టికెట్లు కన్‌ఫార్మ్‌ అయిన వారు ఈ మేరకు లోకల్‌ ట్రైన్‌ టికెట్లు కూడా కొనుగోలు చేయవచ్చు. ప్రయాణాలకు ముందు లేదా తర్వాత ఆరు గంటల్లోపు వాటిని వినియోగించుకోవాలి. సెంట్రల్‌, పశ్చిమ రైల్వే అధికారులు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రతిపాదన పరిశీలించాలంటూ ఈ నెల 15న మహారాష్ట్ర ప్రభుత్వం కోరడంతో రైల్వే అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.