సోమవారం 30 మార్చి 2020
National - Mar 27, 2020 , 12:03:43

లాక్‌డౌన్‌.. తమ్ముడిని చంపిన అన్న

లాక్‌డౌన్‌.. తమ్ముడిని చంపిన అన్న

ముంబయి : కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ అమలవుతున్న సమయంలో బయటకు ఎందుకెళ్లావు? అని సోదరుడిని ప్రశ్నించినందుకు, మాటమాట పెరిగి ప్రాణం తీసే దాకా వచ్చింది. ముంబయి కందివాలి ఏరియాకు చెందిన రాజేశ్‌, దుర్గేశ్‌ అన్నదమ్ములు. గురువారం దుర్గేశ్‌.. కిరణా సరుకులు తెచ్చేందుకు బయటకు వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చిన తమ్ముడిని అన్న రాజేశ్‌ బయటనే నిల్చోబెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లడం? అవసరమా అని ప్రశ్నించాడు. దీంతో అన్నదమ్ముల మధ్య మాటమాట పెరిగింది. దుర్గేశ్‌ తన వదినను చెంపపై కొట్టాడు. కోపంతో ఊగిపోయిన రాజేశ్‌.. కిచెన్‌ కత్తితో దుర్గేశ్‌ను పొడిచాడు. తీవ్ర రక్తస్రావమైన దుర్గేశ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


logo