గురువారం 26 నవంబర్ 2020
National - Oct 01, 2020 , 18:06:47

మ‌హిళ‌లకు ఎస్కార్ట్ పేరుతో రూ. 15 ల‌క్ష‌ల‌కు ముంచిన వైనం

మ‌హిళ‌లకు ఎస్కార్ట్ పేరుతో రూ. 15 ల‌క్ష‌ల‌కు ముంచిన వైనం

ముంబై : మ‌హిళ‌ల‌కు ఎస్కార్ట్ పేరుతో ముఠా స‌భ్యులు ఓ వ్య‌క్తిని నిండా ముంచారు. మేల్ ఎస్కార్ట్ ఉద్యోగం పేరుతో వ్య‌క్తి వ‌ద్ద నుండి రూ. 15 ల‌క్ష‌లు వ‌సూలు చేసి కుచ్చుటోపి పెట్టారు. బాధితుడి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ సంఘ‌ట‌న మ‌హారాష్ర్ట‌లోని ముంబైలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. బాధితుడు టేల‌ర్‌గా ప‌నిచేసేవాడు. కోవిడ్‌-19 సంక్షోభం నేప‌థ్యంలో వ్యాపారం దెబ్బ‌తింది. ఎస్కార్ట్ ఏజెన్సీలో ఉద్యోగం అంటూ ముగ్గురు స‌భ్యుల ముఠా ఇత‌డిని ఆశ్ర‌యించారు. ఉద్యోగంలో భాగంగా ప్ర‌తీరోజు ఓ కొత్త‌ మ‌హిళకు ఎస్కార్ట్‌గా వెళ్తూ డ‌బ్బులు సంపాదించుకోవ‌చ్చ‌ని ఆశ‌చూపారు. కాగా ఉద్యోగం పొందాలంటే ఏజెన్సీలో రిజిస్ట‌ర్ చేసుకోవాల‌ని అందుకు కొంత న‌గ‌దును చెల్లించాల్సి ఉంటుంద‌న్నారు. ఇలా గ‌డిచిన మూడు నెల‌లుగా ప‌లు ద‌ఫాలుగా రూ. 15 ల‌క్ష‌లు లాగారు. ఉద్యోగం లేద‌ని, మోస‌పోయాన‌ని గ్ర‌హించిన బాధితుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు చీటింగ్‌, ఐటీ చ‌ట్టం కింద నిందితుల‌పై కేసు న‌మోదు చేశారు. నిందితుల్లో ఓ మ‌హిళ కూడా ఉంది.