గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 10:10:44

ముంబైని ముంచెత్తిన వాన‌.. వ‌ర‌ద నీటిలో నాయ‌ర్ ద‌వాఖాన‌

ముంబైని ముంచెత్తిన వాన‌.. వ‌ర‌ద నీటిలో నాయ‌ర్ ద‌వాఖాన‌

ముంబై: ఆర్థిక రాజ‌ధాని ముంబైని వ‌ర్షాలు ముంచెత్తాయి. గ‌త 24 గంట‌లుగా ఎడ‌తెర‌పిలేకుండా కురుస్తున్న వాన‌ల‌తో న‌గ‌రంలోని చాలా ప్రాంతాలు వ‌ర‌ద‌ల్లో చిక్క‌కుకున్నాయి. క‌రోనా రోగులకు సేవ‌లందిస్తున్న‌ నాయ‌ర్ ద‌వాఖాన వ‌ర‌ద నీటితో నిండిపోయింది. క‌రోనా వార్డులోని ప‌లు వ‌స్తువులు నీటిలో తేలియాడుతూ కన్పించాయి. వార్డు మొత్తం వాన నీటితో నిండిపోవ‌డంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ముంబైలోని ప‌లుప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు న‌మోద‌య్యాయి. గ‌త 24 గంట‌ల్లో 173 మిల్లీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యింద‌ని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) వెల్ల‌డించింది. దీంతో పలు లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరింది. అదేవిధంగా రైలు పట్టాలు కూడా నీట మునిగాయి. ఫలితంగా లోకల్ రైళ్లతోపాటు బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప‌లు లోక‌ల్ రైళ్ల‌ను వెస్ట్ర‌న్ రైల్వే ర‌ద్దుచేసింది.   


logo