సోమవారం 08 మార్చి 2021
National - Sep 21, 2020 , 13:47:33

ముంబై సినీపరిశ్రమ ప్రజల ప్రాణాలు తీస్తోంది : రూప గంగూలీ

ముంబై సినీపరిశ్రమ ప్రజల ప్రాణాలు తీస్తోంది : రూప గంగూలీ

న్యూఢిల్లీ : ముంబై సినీపరిశ్రమ (బాలీవుడ్‌)పై బీజేపీ ఎంపీ రూప గంగూలీ విరుచుకుపడ్డారు. జనాలను మత్తు పదార్ధాలకు బానిసలుగా మారుస్తూ వారి ప్రాణాలను తీస్తోందని ఆరోపించారు. పరిశ్రమలోని కొందరు పేరున్న వ్యక్తులు మహిళలను తీవ్రంగా కించపరుస్తున్నా ఏ ఒక్కరూ స్పందించడం లేదని, పోలీసులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండటం దారుణమని అన్నారు. లౌంగిక వేధింపుల విషయంలో బాలీవుడ్‌ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. అనురాగ్‌ కష్యప్‌ తనను లైంగికంగా వేధించాడని పాయల్ ‌ఘోష్‌ చెబుతున్నా అతడిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo