గురువారం 28 మే 2020
National - May 21, 2020 , 19:26:43

కొత్త ముఖ్యమంత్రి..పరిస్థితి చేజారిపోయింది: దేవేంద్రఫడ్నవిస్‌

కొత్త ముఖ్యమంత్రి..పరిస్థితి చేజారిపోయింది: దేవేంద్రఫడ్నవిస్‌

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితి రాష్ట్రప్రభుత్వం అదుపులో లేకుండా పోయిందని మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ అన్నారు.

ఫడ్నవిస్‌ మీడియాతో మాట్లాడుతూ..దేశంలోనే కరోనా మహమ్మారి అధికంగా విజృంభిస్తోన్న రాష్ట్రంగా  మహారాష్ట్ర నిలుస్తోంది. ముంబైలో కరోనావ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ఏం చేయలేని స్థితికి వెళ్లిపోయింది. ముఖ్యమంత్రి కొత్తవారని, కొత్త ప్రభుత్వానికి పరిపాలన చేసేంత అనుభవం లేదని ఫడ్నవిస్‌  ఎద్దేవా చేశారు. ప్రభుత్వం కరోనా వ్యాప్తి విషయంలో తొలి దశ లాక్‌డౌన్‌ నుంచి వ్యూహాత్మకంగా తప్పులు చేసుకుంటూ వస్తోందని విమర్శించారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo