బుధవారం 20 జనవరి 2021
National - Dec 25, 2020 , 10:30:49

ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌కు రాజ్‌ఠాక్రేకు కోర్టు నోటీసులు

ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌కు రాజ్‌ఠాక్రేకు కోర్టు నోటీసులు

ముంబై : మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన (ఎంఎన్‌ఎస్‌) చీఫ్‌ రాజ్‌ఠాక్రేకు ముంబైలోని అలోకల్‌ కోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి 5న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. తమ పోస్టర్లను ఎంఎన్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు చింపివేశారని అమెజాన్‌ చేసిన ఫిర్యాదు మేరకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అమెజాన్‌ యాప్‌లో మరాఠీ లాంగ్వేజ్‌ ఆప్షన్‌ లేనందున పోస్టర్లను చింపివేసినట్లు పార్టీ కార్యకర్తలు పేర్కొన్నారు. అమెజాన్ యాప్‌లో మరాఠీని కమ్యూనికేషన్ భాషగా చేర్చాలని కోరుతూ రాజ్ ఠాక్రే అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ కు ఇటీవల లేఖ రాశారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి ప్రాంతీయ భాషలను వినియోగిస్తున్నారని, దేశంలో విస్తృతంగా వాడుతున్న మూడో భాష మరాఠి అని పేర్కొన్నారు. దీనిపై అమెజాన్ కార్యాలయంలో సమావేశమై  సమస్యను పరిష్కరించడానికి 20 రోజుల సమయాన్ని అమెజాన్ కోరింది. అయినా ఎంఎన్ఎస్ కార్యకర్తలు తమ పోస్టర్లను చింపివేశారని అమెజాన్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై కోర్టు జనవరి 5వతేదీన కోర్టుకు హాజరుకావాలని కోరుతూ రాజ్ ఠాక్రేకు సమన్లు జారీ చేసింది. 


logo