బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 12, 2020 , 18:46:39

కరోనా స్పెషల్ ఆటోవాలా.. ఆనంద్ మహీంద్రా ఫిదా

కరోనా స్పెషల్ ఆటోవాలా.. ఆనంద్ మహీంద్రా ఫిదా

ముంబై : ఇప్పటివరకు అత్యంత భయంకరమైన సంవత్సరం ఇదేనేమో. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అంతా తలకిందులుగా మారిపోయింది. ఉద్యోగులు మొదలుకొని నిత్యం కూలీ పనులు చేసుకొనే వారి వరకు.. అందరినీ ఒకేగాటిన కట్టి వేధింపులకు గురిచేస్తున్నది. అయితే, భౌతిక దూరం పాటించడం, ముఖాలకు మాస్క్ లు ధరించడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి వాటి వల్ల కొంతవరకు ఈ వైరస్ బారిన పడకుండా మనకు మనం కాపాడుకోవచ్చని వైద్యనిపుణులు సెలవిస్తున్నారు.

ఈ విధానాలను కొందరు పాటిస్తున్నా.. మరికొందరు పెడచెవిన పెడ్తున్నారు. సమాజాన్ని మార్చడం అనేడి ఎక్కడో ఒక చోట మొదలుకావాల్సిందే అని నమ్మిన ముంబైకి చెందిన ఓ ఆటోవాలా.. సమాజానికి తన వంతు సాయం చేస్తున్నాడు. కేవలం ప్రయాణికులను వారు కోరుకున్న చోట దింపి డబ్బు తీసుకుని చేతులు దులుపుకోవడం కాకుండా.. కరోనా వైరస్ సమయంలో పరిశుభ్రత ఎలా పాటించాలో ప్రత్యక్షంగా ఆచరణలో చూపుతున్నాడు. తన ఆటో వెనుక భాగంలో వాష్ బేసిన్, అద్దంతోపాటు చేతులు కడుక్కునేందుకు హ్యాండ్ వాష్, శానిటైజర్లను సిద్ధంగా ఉంచాడు. తన ఆటోలో ప్రయాణించేవారు చెత్తను రోడ్లపై పారేయకుండా చూసేందుకు తడి, పొడి చెత్తకు వేర్వేరుగా బిన్స్ అమర్చాడు. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో ఎవరిని సంప్రదించాలో కూడా తెలిపే ఫోన్ నంబర్లను ఆటోపై పెయింట్ వేయించాడు. 

ఈ ‘జుగాద్’ ఆటోవాలా వీడియోను మహీంద్రా సంస్థ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఆటోవాలాను చూసిన నెటిజెన్లు అంతా వాహ్ ఏం ఆలోచించావ్ భాయ్ సాబ్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

తన ఆటోను ఎలా తీర్చిదిద్దాడో మీరూ ఓ లుక్కేయండి..logo