మంగళవారం 07 జూలై 2020
National - Jun 20, 2020 , 10:26:12

ముంబై పేలుళ్లు.. రాణాను భార‌త్‌కు అప్ప‌గించ‌నున్నఅమెరికా

ముంబై పేలుళ్లు.. రాణాను భార‌త్‌కు అప్ప‌గించ‌నున్నఅమెరికా

హైద‌రాబాద్‌: 2008 ముంబై పేలుళ్ల‌కు సంబంధించిన నిందితుడు త‌హావుర్ రాణాను అమెరికా పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.  ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు నిధులు స‌మ‌కూరుస్తున్న కేసులో అత‌న్ని అరెస్టు చేశారు. 2008లో ముంబైలో జ‌రిగిన పేలుళ్ల కేసులోనూ త‌హావుర్ రాణా దోషిగా ఉన్నాడు.  రాణాపై భార‌త్‌లో హ‌త్య అభియోగం కింద కేసులు ఉన్నాయి. ల‌ష్క‌రే తోయిబాకు ఆర్థిక స‌హాకారం అందిస్తున్న కేసులో.. 2011లో షికాగో పోలీసులు అత‌న్ని అరెస్టు చేశారు. వాస్త‌వానికి అమెరికాలో రాణాకు 14 ఏళ్ల జైలు శిక్ష ప‌డింది. ఇప్పుడు అత‌న్ని భార‌త్‌కు అప్ప‌గించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

డేవిడ్ కోల్మ‌న్ హెడ్లీ స‌హ‌కారంతో రాణా అమెరికాలో ఉగ్ర‌వాదుల‌కు సాయం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే ముంబై పేలుళ్ల కేసులో హెడ్లీ కూడా దోషిగా ఉన్నాడు. ముంబైలో ఇమ్మిగ్రేష‌న్ వ్యాపారం మొద‌లుపెట్టే విధంగా హెడ్లీని రాణా ప్రేరేపించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్ర‌స్తుతం అమెరికాలో హెడ్లీ 35 ఏళ్ల జైలు శిక్ష‌ను ఎదుర్కొంటున్నాడు. హెడ్లీని మాత్రం ఇప్పుడు భార‌త్‌కు అప్ప‌గించే ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌డం లేదు.  

   


logo