సోమవారం 01 జూన్ 2020
National - May 09, 2020 , 22:24:42

ఇద్ద‌రు పోలీస్ అధికారులు, కానిస్టేబుల్‌పై క‌త్తితో దాడి

ఇద్ద‌రు పోలీస్ అధికారులు, కానిస్టేబుల్‌పై క‌త్తితో దాడి

ముంబై: ద‌క్షిణ ముంబైలో మాద‌క‌ద్ర‌వ్యాల బానిసగా అనుమానిస్తున్న 27 ఏళ్ల యువ‌కుడు ఇద్ద‌రు పోలీస్ అధికారులు, కానిస్టేబుల్‌పై క‌త్తితో దాడికి పాల్ప‌డ్డాడు. నిందితుడిని సిల్వ‌ర్ ఓక్స్ ఎస్టేట్ నివాసి క‌ర‌ణ్ ప్ర‌దీప్ నాయ‌ర్‌గా గుర్తించారు. వాహ‌నాల‌ను త‌నిఖీ చేస్తున్న పోలీసులు నిందితుడి బండీ ఆప‌గానే బండిలో ఉన్న క‌త్తి తీసి దాడి చేయ‌డం ప్రారంభించాడ‌ని మెరైన్ డ్రైవ్ పోలీస్‌స్టేష‌న్ సీనియ‌ర్ పోలీస్ అధికారి మృత్యుంజ‌య్ హిరేమ‌త్ తెలిపారు. నిందితుడిపై ఐపీసీ సెక్ష‌న్ 307 కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. జోన్ 1 డీసీపీ సంగ్రామ్ సింగ్ నిషంద‌ర్ గాయ‌ప‌డిన పోలీసుల‌ను ప‌రామ‌ర్శించారు. 


logo