మంగళవారం 14 జూలై 2020
National - Jun 29, 2020 , 19:20:44

చిన్న వయసు.. పెద్ద మనసు..

చిన్న వయసు.. పెద్ద మనసు..

ముంబై: కొవిడ్‌-19 మహమ్మారితో అతలాకుతలమైన జీవితాలకు తనవంతు సాయమందించేందుకు ఓ యువకుడు ముందుకొచ్చాడు. తన ప్యాకెట్‌ మనీతో పీపీఈ కిట్లు, శానిటైజర్లు, నిత్యావసరాలు కొనుగోలు చేసి, అవసరమున్న వారికి పంచి దాతృత్వాన్ని చాటాడు. అత్యంత చిన్నవయస్సులో రొటరాక్ట్‌ క్లబ్‌కు ప్రెసిడెంట్‌గా నియమించబడ్డాడు.

వివరాల్లోకెళితే, ముంబైకి చెందిన హుస్సేన్‌ జకీర్‌ (17) కరోనాతో పోలీసులు, వైద్యులు చనిపోతున్నారనే విషయం తెలుసుకుని చలించిపోయాడు. వారికోసం ఏదో ఒకటి చేయాలని సేవా కార్యక్రమానికి అంకుర్పారణ చేశాడు. తనవద్ద ఉన్న రూ. 15,000 ప్యాకెట్‌ మనీతో పీపీఈ కిట్లు, శానిటైజర్లు, నిత్యావసరాలు కొన్నాడు. వాటిని అవసరమున్నవారికి పంపిణీ చేశాడు. దీంతో ప్రేరణ పొందిన అతడి స్నేహితులూ తోడయ్యారు. ఈ విషయాన్ని స్థానిక రొటరాక్ట్‌ క్లబ్‌ తెలుసుకుని, జకీర్‌కు అండగా నిలిచింది. అతడి సేవలకు గౌరవంగా క్లబ్‌కు ప్రెసిడెంట్‌ను చేసింది. ఇంతవరకూ ఈ క్లబ్‌కు జకీరే అత్యంత చిన్న వయసుగల ప్రెసిడెంట్‌. కాగా, కొవిడ్‌తో చాలా మంది బాధపడుతున్నారని తెలుసుకున్న జకీర్‌ ఆవేదన చెందాడని, తనకు కొంత డబ్బు ఇవ్వాలని అడగ్గా ఇచ్చానని అతడి తండ్రి పేర్కొన్నాడు. ఆ డబ్బులతో తన కొడుకు ఇతరులకు సేవ చేసినందుకు గర్వంగా ఉందని ఆనందం వ్యక్తంచేశాడు.logo