మంగళవారం 31 మార్చి 2020
National - Mar 21, 2020 , 12:51:24

గజియాబాద్‌ జైల్లో ములాఖత్‌లు నిలిపివేత

గజియాబాద్‌ జైల్లో ములాఖత్‌లు నిలిపివేత

కొవిడ్‌-19 వైరస్‌ విస్తరణ శరవేగంగా విస్తరిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా గజియాబాద్‌ జైలు అధికారులు ములాఖత్‌లపై నిషేధం విధించారు. మార్చి 21 నుంచి 31వ తేదీ వరకు గజియాబాద్‌ జైల్లోని ఖైదీల కుటుంబసభ్యులెవరూ ములాఖత్‌ కోసం రావద్దని అధికారులు సూచించారు.

మరోవైపు గజియాబాద్‌ మెజిస్ట్రేట్‌ అజయ్‌ శంకర్‌ పాండే కూడా అధికారులకు కరోనా నియంత్రణ కోసం కీలక ఆదేశాలు జారీచేశారు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని గజియాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ, గజియాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు ఇతర విభాగాల అధికారులకు సూచించారు. 

ఇప్పటికే యూపీ ఆరోగ్యశాఖ సైతం మార్చి 31న వరకు విద్యాసంస్థలు, కల్చరల్‌ సెంటర్లు, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్‌ పూల్‌లు మూసేయాలని సూచించింది. యూపీలో ఇప్పటివరకు 23 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో 9 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, మరో 14 మంది ఐసోలేషన్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు.


logo
>>>>>>