శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 11, 2020 , 17:47:04

అంబానీ ఇప్పుడు అత్యంత ధనవంతుడు కాదు..

అంబానీ ఇప్పుడు అత్యంత ధనవంతుడు కాదు..

భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఇకపై ఆసియాలో అత్యంత ధనవంతుడు కాదు. ఆ స్థానం ఇప్పుడు అలీబాబా ఫౌండర్‌ జాక్‌ మా సొంతమైంది. కరోనావైరస్ వ్యాప్తి ప్రపంచాన్ని మాంద్యంలోకి నెట్టివేస్తుందనే భయంతో గ్లోబల్ స్టాక్స్‌తో పాటు చమురు ధరలు కుప్పకూలిన తరువాత ఆసియా అత్యంత ధనవంతుడుగా జాక్ మా మారిపోయాడు. 

ఈ క్రమంలోనే ఆసియాలో అత్యంత సంపన్నుడి స్ధానాన్ని భారత పారిశ్రామికవేత్త ముఖేష్‌ అంబానీ కోల్పోయారు.  ఒక్క రోజులోనే ఆయన రూ.44,000 కోట్లు పోగొట్టుకోగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్  షేరు ధర  ఏకంగా 14 శాతం కుప్పకూలింది. రిలయన్స్ షేరు ధర  రూ.1,095 స్థాయికి పడిపోయింది. గత 11 ఏళ్లలో చూస్తే.. షేరు ధర ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి.దీంతో అంబానీ నికర సంపద ఏకంగా 580 కోట్ల డాలర్లు తుడిచిపెట్టుకుపోగా.. ఆసియాలోనే అత్యంత సంపన్నుడి స్ధానాన్ని అలీబాబా గ్రూప్‌ అధినేత జాక్‌మా ఆక్రమించారు. ముఖేష్‌ అంబానీ కంటే 260 కోట్ల డాలర్ల అధిక సంపద (4450 కోట్ల డాలర్లు)తో జాక్‌మా ఆసియా సంపన్నుల్లో నెంబర్‌వన్‌గా నిలిచారు. అయితే ఇది తాత్కాలికమే అని, తిరిగి అంబానీ సత్తా చాటుతాడని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.logo