శుక్రవారం 05 జూన్ 2020
National - Jan 14, 2020 , 02:30:40

చంద్రబాబూ.. విశ్రాంతి తీసుకోండి

చంద్రబాబూ.. విశ్రాంతి తీసుకోండి
  • -కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై ఆంధ్రప్రదేశ్ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం బహిరంగ లేఖ రాశారు. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేసింది మీరు కాదా అని నిలదీశారు. నిస్వార్థంగా కాపుల కోసం ఉద్యమం చేపడితే.. తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టింది నిజంకాదా అని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం చట్టాలను గౌరవించడం లేదంటున్నారని, ఆ మాట పలకడానికి ఆయనకు కనీస అర్హత ఉందా అంటూ ధ్వజమెత్తారు. చందాలతో తాను కాపు ఉద్యమం చేస్తున్నానని నాడు ఆరోపణలు చేయించారని, మరి మీరు ఇప్పుడు జోలె పట్టి అడుక్కోవడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. మీరు చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారమా అని నిలదీశారు. బాబు కులం కోసమే ఉద్యమం చేస్తున్నారా అన్ని అంటు ప్రశ్నలు సంధించారు. బాబు రాక్షస పాలన నుంచి ముందు తెలంగాణ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు విముక్తి పొంది అదృష్టవంతులయ్యారని పేర్కొన్నారు. ప్రజలిచ్చిన తీర్పును స్వాగతించి విశాంత్రి తీసుకోండని చెప్పారు.


logo