శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 13, 2020 , 17:02:37

కడక్‌నాథ్‌ కోళ్లను ఆర్డర్‌ చేసిన ఎంఎస్‌ ధోని.. ఎందుకో తెలుసా.?

కడక్‌నాథ్‌ కోళ్లను ఆర్డర్‌ చేసిన ఎంఎస్‌ ధోని.. ఎందుకో తెలుసా.?

భోపాల్‌ : భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని తన ఆర్గానికి పౌల్ట్రీ యూనిట్‌లో ప్రఖ్యాత నల్లజాతి కడక్‌నాథ్‌ కోళ్లను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన 2 వేల నల్ల కడక్‌నాథ్‌ కోళ్లను తెప్పిస్తున్నారు. కడక్‌నాథ్‌ జాతి కోళ్ల పుట్టినిళ్లయిన మధ్యప్రదేశ్‌లోని జాబువా జిల్లా నుంచి త్వరలోనే రాంచీలోని ధోని వ్యవసాయ క్షేత్రానికి కోళ్లు రానున్నాయి. కడక్‌నాథ్‌ కోళ్లు కావాలని ఎంస్ ధోని తన స్నేహితుల ద్వారా తనను సంప్రదించాడని జాబువాలోని కడక్‌నాథ్‌ కోళ్ల పరిశోధన కేంద్రం డైరెక్టర్‌ ఐఎస్‌ తోమర్‌ తెలిపారు.

ఇప్పటికిప్పుడు తాము కోళ్లను పంపే స్థితిలో లేమని థాండ్లా  రైతులను కలవాలని ధోనికి సూచించినట్లు పేర్కొన్నారు. కడక్‌నాథ్‌ కోళ్ల మాంసానికి జియోగ్రాఫికల్‌ ఇండెక్స్‌ ట్యాగ్‌ (జీఐ ట్యాగ్‌) ఉంది. ఈ కోళ్ల మాంసం, రక్తం నలుపు రంగులో ఉండి చాలా రుచికరంగా ఉంటుంది. మాంసంలో కొవ్వు-కొలస్ట్రాల్‌ లేకపోవడంతో మార్కెట్‌లో భారీ గిరాకీ ఉంటుంది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.