సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 07, 2020 , 20:40:35

ఈ తరానికి స్ఫూర్తి ఎంఎస్‌ ధోని : పృధ్వీ షా

ఈ తరానికి స్ఫూర్తి ఎంఎస్‌ ధోని : పృధ్వీ షా

న్యూఢిల్లీ : ఈ తరం మొత్తానికి మహేంద్రసింగ్‌ ధోని స్ఫూర్తిదాయకమని భారత టెస్టు క్రికెట్‌ జట్టు ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ పృధ్వీ షా పేర్కొన్నారు. మంగళవారం  భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని జన్మదినం సందర్భంగా పృధ్వీ షా ఆయనకు ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. ధోని లాంటి లెజెండరీ క్రికెటర్‌తో కలిసి ఆడడం తన అదృష్టమని అతని సూచనలు తనకు ఎంతగానో ఉపకరించాయని ఈ 20ఏండ్ల క్రికెటర్‌ పేర్కొన్నారు.‘ జన్మదిన దిన శుభాకాంక్షలు మహీ భాయ్‌. నువ్వు ఈ తరానికి మొత్తం స్ఫూర్తిదాయం. ఈ ప్రత్యేకమైన రోజు నీలో సంతోషం ఎంతో ఉల్లాసం నింపాలి. నీ సూచనలు అందిపుచ్చుకున్నాం లివింగ్‌ లిజెండ్’‌ అంటూ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. కాగా ధోని మంగళవారం తన 39వ పుట్టినరోజులను జరుపుకున్నారు. భారత క్రికెట్‌ చరిత్రలో ఐసీసీ ముఖ్యమైన ట్రోఫీలైన ఐసీసీ వరల్ట్‌ కప్‌ (50ఓవర్లు), టీ20 వరల్డ్‌ కప్‌ (20ఓవర్ల), చాంపియన్స్‌ ట్రోఫీలను ధోని సారథ్యంలోనే భారత జట్టు సాధించింది. logo