మంగళవారం 31 మార్చి 2020
National - Mar 05, 2020 , 13:11:55

మాస్క్‌లు, శానిటైజర్‌తో పార్లమెంట్‌కు ఎంపీలు..

మాస్క్‌లు, శానిటైజర్‌తో పార్లమెంట్‌కు ఎంపీలు..

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంపీలు కూడా అప్రమత్తమయ్యారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సుశీల్‌ కుమార్‌ గుప్తా ముఖానికి మాస్క్‌ ధరించి, శానిటైజర్‌తో వచ్చారు. కరోనాను నియంత్రించే చర్యల్లో భాగంగా పార్లమెంట్‌ హౌస్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేయాలని రాజ్యసభ చైర్మన్‌కు సుశీల్‌ కుమార్‌ గుప్తా లేఖ రాశారు. లఢఖ్‌ బీజేపీ ఎంపీ జమ్యాంగ్‌ నామ్‌గ్యల్‌ కూడా మాస్క్‌ ధరించి పార్లమెంట్‌కు హాజరయ్యారు. 

కరోనాతో ఇప్పటి వరకు చైనాలో 3015 మంది మృతి చెందారు. 80,565 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ వ్యాధి బారిన పడిన వారిలో 52 వేల మంది రికవరీ అయ్యారు. చైనా కాకుండా ఇతర దేశాల్లో 260 మంది కరోనాతో చనిపోయారు. 


logo
>>>>>>