మంగళవారం 26 మే 2020
National - May 08, 2020 , 14:09:19

'ఆయన కనబర్చిన ఉదారత అసాధారణం'

'ఆయన కనబర్చిన ఉదారత అసాధారణం'

అమరావతి:  ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ముఖ్యమంత్రి జగన్  స్పందించిన తీరును దేశమంతా ప్రశంసాపూర్వకంగా చూస్తోందని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి అన్నారు.  రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా బాధిత కుటుంబాల పట్ల ఆయన కనబర్చిన ఉదారత అసాధారణం అని కొనియాడారు. ఆపదలో  ఆపన్న హస్తం అందించే వారు తమ సీఎంగా  ఉన్నందుకు ప్రజలు సంతోషిస్తున్నారని తెలిపారు. గ్యాస్‌ లీగ్‌ ఘటనపై విజయ సాయిరెడ్డి ట్విటర్లో స్పందించారు. 

'గ్యాస్‌ లీక్ మృతుల కుటుంబాలకు 25 లక్షల సాయం అందించాలని కన్నా పట్టుబట్టారు. సీపీఐ  నారాయణ 50, రామకృష్ణ 25 లక్షలివ్వాలని డిమాండ్లు పెట్టారు.  సీఎం జగన్  ఒక్కో కుటుంబానికి కోటి ఇచ్చి ఆదుకుంటామని ప్రకటించారు. బాధిత కుటుంబాల పట్ల ఆయన అంతులేని వాత్సల్యాన్ని ప్రదర్శించారని' విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్‌లో విషవాయువు లీకైన్‌ ఘటనలో మొత్తం మృతుల సంఖ్య 12కు చేరింది. logo