గురువారం 02 జూలై 2020
National - Apr 18, 2020 , 17:53:38

లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన లోకేష్‌..కొడుకుకు స్కేట్‌బోర్డ్‌ ప్రాక్టీస్‌

లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన లోకేష్‌..కొడుకుకు స్కేట్‌బోర్డ్‌ ప్రాక్టీస్‌

అమరావతి: ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్లో  వ్యంగ్యంగా స్పందించారు. 'కరోనా విపత్తులో కష్టాలను దిగమింగుతూ దేశంలో కోట్లాది మంది ప్రజలు గడపదాటకుండా లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు. ఐతే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సుపుత్రుడు ‘మాలోకం’ మాత్రం లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి యథేచ్ఛగా రోడ్లపై చక్కర్లు కొడుతూ ‘మాతృభాష’లో కొడుకు దేవాన్ష్‌కు స్కేట్‌బోర్డు నేర్పిస్తున్నాడు. హ్యాట్సాఫ్‌!' అంటూ విజయ సాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.  లోకేశ్‌ తన కుమారుడితో కలిసి భద్రత నడుమ సైకిలింగ్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌  కావడంతో విజయ సాయిరెడ్డి సెటైర్లు వేశారు. 
logo