శనివారం 30 మే 2020
National - May 19, 2020 , 13:18:51

'సీఎం కేసీఆర్ ఏదో అంటారని ఆశపడి భంగపడ్డారు'

'సీఎం కేసీఆర్  ఏదో అంటారని ఆశపడి భంగపడ్డారు'

అమరావతి: ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్విటర్‌ వేదికగా పలు అంశాలపై ఆయన స్పందించారు.  'సగం రాష్ట్రానికి తాగు, సాగు నీరందించే పోతిరెడ్డిపాడు గురించి నోరు మెదపడు. ఎవరో సస్పెండైన డాక్టరు తాగి రోడ్డుమీద చిందులేస్తే ఒకటే ట్వీట్లు పెడుతున్నాడు. ప్యాకేజీ తీసుకుని పనిచేసే జీతగాళ్లను కూడా ఎగదోస్తున్నాడు. వ్యక్తుల ప్రయోజనాలు తప్ప రాష్ట్రం గురించి పట్టదా చంద్రబాబూ? అని ట్వీట్‌లో  విమర్శించారు. 

'కరోనా మనతోటే ఉంటుంది కాబట్టి 65 ఏళ్లు దాటినోళ్లు బయటకు రావద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  కూడా చెప్పారు. జాగ్రత్త బాబూ! నీకు 71 ఏళ్లు అని వైరస్ ఇట్టే పసిగడుతుంది.  40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎం, ప్రతిపక్ష నేతగా పదకొండేళ్లు లాంటివి కరోనాకు అర్థం కావు. అని సెటైర్లు వేశారు.

'ఆ క్షణం కోసం ఎల్లో మీడియా వారం రోజులపాటు ఎదురు చూసింది. ఎడిటోరియల్స్, కాంగ్రెస్ వాళ్లని రెచ్చగొట్టడాలు, టీవీల్లో జలజగడాలంటూ తగాదా పెట్టే చర్చలు అన్నీ నీరు కారిపోయాయి. కేసీఆర్  ప్రెస్ మీట్లో ఏదో అంటారని ఆశపడి భంగపడ్డారు. బాబు కూడా లైవ్ చూశాడంట ఏదైనా వినిపిస్తుందేమో అని. అని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. 


logo