గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 14, 2020 , 20:55:28

ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా ఆమోదం...

ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా ఆమోదం...

మధ్యప్రదేశ్‌: ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కమల్‌నాథ్‌ కేబినెట్‌లో మంత్రులుగా ఉండి ఉద్వాసనకు గురైన ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాలకు స్పీకర్‌ ఎన్‌పీ ప్రజాపతి ఆమోదం తెలిపారు. ఎమ్మెల్యేలు ఇమ్రతీదేవీ, తులసీషీలావట్‌, పి.సింగ్‌థోమర్‌, మహేంద్రసింగ్‌, గోవింద్‌సింగ్‌, పి.రామ్‌చౌదరీలు తమ పదవులకు రాజీనామా చేశారు. మంత్రివర్గం నుంచి తొలగించిన అనంతరం సింధియా వర్గంలో ఆరుగురు ఎమ్మెల్యేలు చేరిపోయారు. 

మరోవైపు ఈ రోజు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మధ్యప్రదేశ్‌ రాష్ట్ర నాయకులు గవర్నర్‌ లాల్జీ టాండన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌కు వినతిపత్రం అందించారు. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలనీ.. అదే సమయంలో వీడియో కూడా తీయాలని వారు గవర్నర్‌ను కోరారు. గవర్నర్‌ లాల్జీ టాండన్‌ను కలిసిన వారిలో మాజీ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌, గోపాల్‌ భార్గవ, నరోత్తమ్‌ మిశ్రా, భూపేంద్ర సింగ్‌ ఉన్నారు. 


logo
>>>>>>