ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 22:16:35

మీరే రాముడిని అవమానించడమా శోభాజీ?

మీరే రాముడిని అవమానించడమా శోభాజీ?

అయోధ్యలో శ్రీరాముడి ఆలయానికి ప్రధాని నరేంద్ర మోడీ పునాది వేశారు. ఈ సందర్భంగా కర్ణాటకలోని ఉడిపి చిక్మగళూరు ఎంపి శోభా కరంద్లాజే.. మోదీ పట్ల అతిప్రేమను చూపారు. ట్విట్టర్లో ఆమె పోస్ట్ను మరో ఎంపీ శశి థరూర్ రీట్వీట్ చేశారు. దాంతో శోభా కరంద్లాజేపై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. 

అయోధ్యలో రామాలయ భూమిపూజ సందర్భంగా మోదీకి ప్రత్యేక స్వాగతం పలుకాలన్న ఆనందంలో శ్రీరాముడిని తోడ్కొని వస్తున్న మోదీ గ్రాఫిక్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ గ్రాఫిక్ లో మోదీ గొప్పగా, పెద్దగా ఉండగా.. రాముడు మరుగుజ్జుగా ఉండటం నెటిజెన్ల ఆగ్రహానికి కారణమైంది. ఈ ట్వీట్ ను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ రీట్వీట్ చేసి రాముడి కంటే గొప్పగా మోదీని చూపించడంలో మీ ఆంతర్యమేంటి? అని ప్రశ్నించారు. ఇది ఏ రామ్ చరిత్ మానస్ లో ఉన్నదో చెప్పాలన్నారు. దాంతో నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరు ఎన్ శేతు అనే యూజర్.. ఏకంగా ఫొటోను తొలగించమని శోభా కరంద్లాజేను కోరారు. శ్రీరాముడి కంటే నరేంద్ర మోదీ పెద్దవాడు కాదని కూడా అన్నారు. ఇలాంటి అర్ధంలేని ఫొటోలను పోస్ట్ చేయడం మానేయండి అని సలహా ఇచ్చారు. రాముడి కీర్తిని అవమానించే ఇలాంటి ఫొటోల ద్వారా హిందువులమైన మనమే స్వయంగా రాముడిని అవమానిస్తున్నామని మరో నెటిజెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.logo