ఆదివారం 29 మార్చి 2020
National - Mar 02, 2020 , 19:28:56

శ‌శిథ‌రూర్ మెడ‌లో ఎయిర్‌టేమ‌ర్‌..

శ‌శిథ‌రూర్ మెడ‌లో ఎయిర్‌టేమ‌ర్‌..

హైద‌రాబాద్‌:  ఎంపీ శ‌శి థ‌రూర్ మెడ‌లో క‌నిపిస్తున్న ఓ గ్యాడ్జెట్‌ను చూస్తున్నారా.?   దీని ప్ర‌త్యేక‌త‌లు తెలుసుకోవాల‌నుకుంటున్నారా.?  ఇవాళ పార్ల‌మెంట్‌కు వ‌చ్చిన‌ప్పుడు.. ఎంపీ శ‌శిథ‌రూర్ ఇలా క‌నిపించారు. ఆయ‌న మెడ‌లో ఉన్న‌ది ఎయిర్‌టేమ‌ర్‌.  దీన్నే ఎయిర్ ప్యూరిఫ‌య‌ర్ అంటారు.  ఎయిర్‌టేమ‌ర్ మ‌న దగ్గ‌ర ఉంటే.. ఇక యాంటీ పొల్యూష‌న్ మాస్క్‌లు అవ‌స‌రం లేదు. ఎయిర్ సానిటైజ‌ర్ కూడా అవ‌స‌రం ఉండ‌దు. క‌నీసం మూడు అడుగ‌ల దూరం వ‌ర‌కు.. ఈ ఎయిర్‌టేమ‌ర్ మెషీన్ వ‌ల్ల గాలి శుద్ధి అవుతుంది.  అత్యంత విష‌పూరిత‌మైన గాలుల‌ను కూడా ఎయిర్‌టేమ‌ర్ ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌ద‌ట‌. ఈ మెషిన్ ఉంటే.. మ‌న‌కు స్వ‌చ్ఛ‌మైన గాలి పీల్చుకునే అవ‌కాశం ఉంటుంది. బ్యాక్టీరియాను కూడా ఎయిర్‌టేమ‌ర్ చంపేస్తుంద‌ట‌. దీన్ని ఒక సారి చార్జ్ చేస్తే.. 150 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేస్తుంది. 


logo