శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 14, 2020 , 01:56:13

కలిసికట్టుగా పోరాడుదాం

కలిసికట్టుగా పోరాడుదాం

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను కబళిస్తున్న కరోనా మహమ్మారిపై ఉమ్మడిగా పోరాడుదామని సార్క్‌ (దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సమాఖ్య) దేశాలకు ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. ఇందుకు బలమైన వ్యూహాన్ని రచించేందుకు భాగస్వామ్య దేశాధినేతలందరూ వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చిద్దామని ట్విట్టర్‌ వేదికగా ప్రతిపాదించారు. దీనిపై పాకిస్థాన్‌ మినహా మిగిలిన అన్ని సభ్యదేశాల నుంచి సానుకూల స్పందన లభించింది. 


మోదీ ప్రతిపాదనను శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స, నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి,  మాల్దీవులు అధ్యక్షుడు ఇబ్రహీం అహ్మద్‌ సోలీ,  భూటాన్‌ ప్రధాని లోటే షెరింగ్‌,  బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి షహ్రియార్‌ ఆలం,  ఆఫ్ఘనిస్థాన్‌ అధ్యక్షుడి అధికార ప్రతినిధి స్వాగతించారు. కాగా, ఈ నెల 21 నుంచి రెండు రోజులపాటు మోదీ గుజరాత్‌లో పర్యటించాల్సి ఉండగా, కరోనా కారణంగా అది వాయిదా పడింది.


logo