గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 19:44:16

రేపు మధ్యప్రదేశ్‌ క్యాబినేట్‌ సమావేశం

రేపు మధ్యప్రదేశ్‌ క్యాబినేట్‌ సమావేశం

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తోపాటు మంత్రి అరవింద్ భదోరియాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మొదటిసారి వర్చువల్ పద్ధతిలో క్యాబినెట్ సమావేశం నిర్వహించనుంది. చౌహాన్ ప్రస్తుతం భోపాల్‌లోని చిరాయు దవాఖానలో చికిత్స పొందుతున్నారు.

శనివారం ఆయన కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆదివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అధికారులతో సమీక్షించారు. మహమ్మారి విజృంభించకుండా పాలనా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రజల సహకారంతోపాటు సామాజిక సేవా సంస్థల సహకారాన్ని తీసుకోవాలని ఆయన సూచించారు.logo