ఆదివారం 17 జనవరి 2021
National - Dec 05, 2020 , 22:03:37

‘ధర్మ స్వాతంత్ర్య’ బిల్లుపై సీఎం చౌహాన్‌ సమీక్ష

‘ధర్మ స్వాతంత్ర్య’ బిల్లుపై సీఎం చౌహాన్‌ సమీక్ష

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ‘ధర్మ స్వాతంత్ర్య’ (మత స్వేచ్ఛ) బిల్లు 2020పై సీఎం శివరాజ్ సింగ్‌ చౌహాన్‌ సమీక్ష జరిపారు. శనివారం భోపాల్‌లో దీనిపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. బలవంత మత మార్పిడిని అడ్డుకోవడమే ఈ బిల్లు ఉద్దేశమని చెప్పారు. వివాహం లేదా మరో ప్రలోభంతో మతం మార్పిడిని ఈ బిల్లు నిరోధిస్తుందని చెప్పారు. లవ్‌ జిహాద్‌ను అడ్డుకునేందుకు బీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రత్యేక చట్టాలను తీసుకొస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే బలవంత మత మార్పిడి నిషేధ బిల్లును తీసుకు వచ్చింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి