బుధవారం 05 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 17:03:55

ఎంపీ అమ‌ర్‌సింగ్ క‌న్నుమూత‌

ఎంపీ అమ‌ర్‌సింగ్ క‌న్నుమూత‌

ఢిల్లీ : రాజ్యసభ ఎంపి, సమాజ్ వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్(64) సుదీర్ఘ‌ అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. అనారోగ్యం కార‌ణంగా గత ఏడు నెలలుగా ఆయ‌న‌ సింగపూర్ మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో నేడు మృతిచెందారు. చాలాకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయ‌న 2009 లో ఒక‌సారి అదేవిధంగా 2018 లో మ‌రోసారి కిడ్ని మార్పిడి చేయించుకున్నారు.

ఈ ఏడాది మార్చిలో అత‌ని మ‌ర‌ణంపై పుకార్లు చెల‌రేగిన‌ప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా టైగర్ జిందా హై అనే శీర్షికతో ఓ వీడియోను విడుద‌ల చేశారు. త‌న‌లో తగినంత ధైర్యం, ఉత్సాహం, ఆత్మశ‌క్తి మిగిలి ఉన్నాయ‌న్నారు. త‌న అనారోగ్యానికి చిక‌త్స జ‌రుగుతోంద‌ని భవానీ మాత ఆశీర్వాదంతో డబుల్ ఎనర్జీతో తిరిగి వస్తాన‌ని పేర్కొన్నాడు. అమ‌ర్‌సింగ్‌కు భార్య పంకజా కుమారీ సింగ్‌, కవల కుమార్తెలు ఉన్నారు. 


logo