బుధవారం 27 జనవరి 2021
National - Dec 22, 2020 , 01:21:55

మోతీలాల్‌ ఓరా కన్నుమూత

మోతీలాల్‌ ఓరా కన్నుమూత

  • కరోనా అనంతర సమస్యలతో మృతి

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మోతీలాల్‌ ఓరా (92) కన్నుమూశారు. కరోనా అనంతర అనారోగ్య సమస్యలతో సోమవారం తుదిశ్వాస విడిచారు. అక్టోబర్‌లో ఆయనకు కరోనా సోకింది. అనంతరం కోలుకున్నారు. అయితే మూత్ర సంబంధిత, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ సోకడంతో ఢిల్లీలోని ఎస్కార్ట్స్‌ దవాఖానలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. ఆయన ఆదివారమే 92వ పుట్టినరోజు జరుపుకొన్నారు. అవిభాజ్య మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌గా  పనిచేశారు. 


logo