మంగళవారం 04 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 09:40:34

త‌ల్లీకుమారుడు ఒకేసారి టెన్త్ పాస్

త‌ల్లీకుమారుడు ఒకేసారి టెన్త్ పాస్

ముంబై : మ‌హారాష్ర్ట టెన్త్ ప‌రీక్ష‌ల్లో త‌ల్లీకుమారుడు ఒకేసారి పాస్ అయ్యారు. 36 ఏళ్ల వ‌యసున్న బేబీ గౌర‌వ్‌, ప్ర‌దీప్ గౌర‌వ్‌కు కొన్నేళ్ల క్రితం పెళ్లి అయింది. అప్పుడు బేబీది చిన్న వ‌య‌సు. ప‌దో త‌ర‌గ‌తి కూడా పూర్తి కాలేదు. మొత్తానికి పెళ్లై, పిల్ల‌లు క‌లిగిన త‌ర్వాత ఆమెకు చదువుకోవాల‌న్న కోరిక క‌లిగింది. దీంతో భ‌ర్త ప్రోత్సాహం, కుమారుడి స‌హ‌కారంతో పదో త‌ర‌గ‌తి పుస్తకాల‌తో కుస్తీ ప‌ట్టింది. తన 16 ఏళ్ల కుమారుడు సదానంద కూడా ప‌దో త‌ర‌గ‌తి కావ‌డంతో.. ఆయా స‌బ్జెక్టుల్లో ఉన్న సందేహాల‌ను అత‌నితో చ‌ర్చించి చ‌దువుకునేది. త‌ల్లీకుమారుడు ఇద్ద‌రు క‌లిసి చ‌దువుకుని ప‌ది ఫ‌లితాల్లో మంచి మార్కులు సాధించారు. త‌ల్లి బేబీ 64.40 శాతం మార్కులు సాధించ‌గా, కుమారుడు 73.20 శాతం మార్కులు సాధించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. 

ఈ సంద‌ర్భంగా బేబీ మాట్లాడుతూ.. త‌న‌కు చిన్న‌త‌నంలో వివాహ‌మైంది. ప‌ది కూడా పూర్తి చేయ‌లేదు. త‌న భ‌ర్త ప్రోత్స‌హాంతో మ‌ళ్లీ పుస్త‌కాలు ప‌ట్టాను. తన కుమారుడితో పాటు ప‌ది పాస్ అయ్యాను. తాను బ‌ట్ట‌ల త‌యారీ కంపెనీలో ప‌ని చేస్తాను. ఖాళీ స‌మ‌యాల్లో అక్క‌డ కూడా చ‌దువుకునేదాన్ని. ఇక ఇంటికి వ‌చ్చిన త‌ర్వాత మ్యాథ్స్, సైన్స్ స‌బ్జెక్టు, ఇంగ్లీష్ గ్రామ‌ర్ త‌న కుమారుడితో చెప్పించుకునేదాన్ని అని తెలిపింది. అలా మొత్తానికి ప‌ది పాస్ కావ‌డం సంతోషంగా ఉంది. ఇంట‌ర్ కూడా చేస్తాన‌ని బేబీ పేర్కొంది. logo