శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 13:00:37

హృద‌యాన్ని క‌దిలించే ఎలుక ప్రేమ‌.. పిల్ల‌ల్ని కాపాడుకునే ప్ర‌య‌త్నంలో!

హృద‌యాన్ని క‌దిలించే ఎలుక ప్రేమ‌.. పిల్ల‌ల్ని కాపాడుకునే ప్ర‌య‌త్నంలో!

మ‌నుషులైనా జంతువులు, ప‌క్షుల్లో అయినా త‌ల్లి ప్రేమ త‌ల్లిదే. బిడ్డ‌ల‌కు ఏ మాత్రం క‌ష్టం వ‌చ్చినా త‌ల్లి మ‌న‌సు అల్లాడిపోతుంది. ఎన్నిరోజుల్నుంచో గూడు క‌ట్టుకున్న తొర్ర‌లో ఎలుక‌ కుటుంబం నివాశం ఉంటుంది. భారీ వ‌ర్షం వ‌ల్ల ఎలుక గూడు నీటితో మునిగిపోయింది. గూడులోకి నీరు చేర‌డంతో ఎలుక పిల్ల‌లు నీటిలో మునిగిపోయాయి. చిన్న‌పిల్ల‌లు కావ‌డంతో అవి క‌ద‌ల్లేని ప‌రిస్థితి.

ఒక‌వైపు వ‌ర్షం మ‌రోవైపు పిల్ల‌లు. ఏం చేయాలో ఆ త‌ల్లి ఎలుక‌కు అర్థం కాలేదు. ఈ స‌మ‌యంలో ఎంతో ఓర్పుగా ఆలోచిస్తే ఒక ఉపాయం త‌ట్టింది. ఇక వెంట‌నే ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా త‌ల్లి ఎలుక పిల్ల‌ల‌ను నోటికి క‌రిపిచ్చుకొని ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు చేర్చింది. పిల్ల‌లు క్షేమంగా ఉండ‌డంతో ఇప్పుడు త‌ల్లి మ‌న‌సు కాస్త కుదుట‌ప‌డింది. పిల్ల‌లు సంతోషంగా ఉంటేనే త‌ల్లి కూడా ఆనందంగా ఉంటుంది. ఈ వీడియో ప్ర‌తి త‌ల్లికి అంకితం చేస్తున్నారు నెటిజ‌న్లు. ఈ సంఘ‌ట‌న ఎక్క‌డ చోటుచేసుకున్న‌దో కాని సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్న‌ది. తాజావార్తలు


logo