సోమవారం 06 జూలై 2020
National - May 30, 2020 , 15:51:48

బిడ్డ కోసం పామును పరుగులు పెట్టించిన ఎలుక.. వీడియో

బిడ్డ కోసం పామును పరుగులు పెట్టించిన ఎలుక.. వీడియో

రక్తం పంచుకుపుట్టిన బిడ్డ.. ఆపదలో ఉన్నప్పుడు ఏ తల్లి ప్రాణమైనా తల్లడిల్లుతుంది. తన బిడ్డకు అండగా నిలవాలని ఆరాటపడుతోంది తల్లి. బిడ్డ ప్రాణాల కోసం తన ప్రాణాలను ఫణంగా పెడుతుంది మాతృమూర్తి. అమ్మలోని గొప్పతనం అలాంటిది మరి. 

ఓ ఎలుక తన బిడ్డతో కలిసి రోడ్డుపక్కనే ఉన్న పొదల్లో ఉన్నది. ఈ రెండింటిని ఓ పాము చూసి ఉరకలేసింది. చంటి ఎలుకను నోటితో పట్టేసింది ఆ సర్పం. దాన్ని మింగేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తల్లి ఎలుక.. పాముపై వీరోచిత పోరాటం చేసింది. చివరకు ఎలుక దాడిని తట్టుకోలేని పాము తోక ముడిచింది. నోట్లో ఉన్న పిల్ల ఎలుకను వదిలేసి పొదల్లోకి పారిపోయింది. ప్రాణాలతో బయటపడ్డ బిడ్డను చూసి తల్లి ఎలుక ఊపిరి పీల్చుకుంది. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ సుశాంత నందా తన ట్విట్టర్‌ పేజీలో పోస్టు చేశారు. తన బిడ్డ కోసం ఏ తల్లి అయినా.. ఏమైనా చేయగలుగుతుంది. ఈ భూమ్మీద మాతృత్వం ఒక పెద్ద ఆయుధమని నందా పేర్కొన్నారు. 


logo