మంగళవారం 07 జూలై 2020
National - Jun 06, 2020 , 17:19:52

కేంద్ర‌మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు మాతృవియోగం

కేంద్ర‌మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు మాతృవియోగం

ముంబై: కేంద్ర‌ మంత్రి పీయూష్‌ గోయల్‌‌కు మాతృవియోగం జరిగింది. వృద్ధాప్యం కార‌ణంగా ఆయన తల్లి చంద్రకాంత‌ గోయల్‌ మృతి చెందారు. ఈ బాధాక‌ర‌మైన స‌మాచారాన్ని పీయూష్‌ గోయల్‌ తన ట్విట్ట‌ర్‌‌ ఖాతా ద్వారా పంచుకున్నారు. తన తల్లి జీవితం మొత్తం  ప్రజలకు సేవచేయడానికే అంకితం చేసిందని, ఇతరులను కూడా అదేవిధంగా సమాజ శ్రేయస్సుకు పాటుపడేలా ప్రేరేపించింద‌ని పీయూష్ గోయ‌ల్ ట్విట్ట‌ర్లో పేర్కొన్నారు. 

కాగా, శ‌నివారం మ‌ధ్యాహ్నం చంద్ర‌కాంత గోయ‌ల్ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించిన‌ట్లు మహరాష్ట్ర బీజేపీ నేత‌, మాజీ మంత్రి వినోద్‌ తవ్డే తెలిపారు. చంద్ర‌కాంత గోయ‌ల్ 1975 ఎమర్జెన్సీ తర్వాత ముంబై కార్పొరేటర్‌గా పనిచేశారు. అనంతరం మాతుంగా నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు బీజేపీ తర‌ఫున అసెంబ్లీకి‌ ప్రాతినిధ్యం వహించారు. పీయూష్ గోయ‌ల్ తండ్రి, దివంగత వేద్‌ ప్రకాష్‌ గోయల్ సైతం బీజేపీ జాతీయ కోశాధికారిగా, అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో షిప్పింగ్‌ మంత్రిగా పనిచేశారు.


logo