శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 22, 2020 , 22:19:00

ఓ త‌ల్లి బిడ్డ‌ను ఎలా కాపాడుకుందో చూడండి.. వీడియో

ఓ త‌ల్లి బిడ్డ‌ను ఎలా కాపాడుకుందో చూడండి.. వీడియో

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ష‌కార్‌పూర్ ఏరియాలో ఇద్ద‌రు దుండ‌గులు ప‌ట్ట‌ప‌గ‌లే చిన్నారిని కిడ్నాప్‌ చేసేందుకు య‌త్నించారు. ఇంటి గ‌డ‌ప‌లోపల ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకుని ప‌రుగు తీస్తున్న కిడ్నాప‌ర్‌ను గ‌మ‌నించిన త‌ల్లి ఒక్క‌సారిగా అతనిపై లంఘించింది. అతనితో పెనుగులాడి చిన్నారిని లాక్కుంది. చిన్నారిని వ‌దిలి గ‌ల్లీలో నుంచి పారిపోతున్న కిడ్నాప‌ర్లను స్థానికులు వెంబ‌డించారు. వాళ్ల బైకుకు మ‌రో బైకును అడ్డంపెట్టి కింద‌ప‌డేశారు. దీంతో కిడ్నాప‌ర్‌లు బైకును వ‌దిలేసి స్థానికుల నుంచి త‌ప్పించుకున్నారు. 

కాగా, బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు వెంటనే ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలించి ఇద్ద‌రినీ అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు చిన్నారి స‌మీప బంధువేన‌ని గుర్తించారు. వారి నుంచి న‌కిలీ నెంబ‌ర్ ప్లేట్ ఉన్న బైకును, ఒక దేశ‌వాలీ పిస్తోల్‌ను, ఒరిజిన‌ల్ నెంబ‌ర్ ప్లేట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo