బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 19:27:30

బావిలో ప‌డిన కోతిపిల్ల‌ను కాపాడుకునేందుకు త‌ల్లి తాప‌త్ర‌యం : వీడియో వైర‌ల్‌

బావిలో ప‌డిన కోతిపిల్ల‌ను కాపాడుకునేందుకు త‌ల్లి తాప‌త్ర‌యం :  వీడియో వైర‌ల్‌

త‌ల్లి ప్రేమ త‌ల్లిదే. ఈ ప్రేమ‌ను దేనితో పోల్చేలేం. వెల‌క‌ట్ట‌లేని ప్రేమ అమ్మ‌దే. పిల్ల‌ల‌కు క‌ష్టం వ‌చ్చిందంటే త‌న ప్రాణాల‌ను సైతం లెక్క‌పెట్ట‌కుండా పోరాడి గెలుస్తుంది. బావిలో మ‌నుషులు ప‌డి బ‌య‌ట‌కు రాలేక ప్రాణాలు కోల్పోయిన వాళ్లు చాలామందే ఉన్నారు. కానీ బావిలో ప‌డ్డ కోతిపిల్ల‌ను ప్రాణాల‌తో కాపాడి బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చింది త‌ల్లి కోతి. ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్‌లో వైర‌ల్‌గా మారింది.

పిల్ల‌కోసం ఒక యోధునిగా పోరాడింది. ఇప్ప‌టివ‌ర‌కు పిరికిదానిలా ఉండే ఏ త‌ల్లైనా బిడ్డ‌ల‌కు ఆప‌ద వ‌స్తే రుద్ర‌మ‌దేవిలా పోరాడుతుంది అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇప్పుడు ఈ వ‌న్య‌ప్రాణుల విష‌యంలో కూడా ఇలానే జ‌రిగింది. ప్ర‌మాద‌వ‌శాత్తు బావిలో ప‌డిన కోతిపిల్ల‌ను కాపాడే విధానం చూసి నెటిజ‌న్లు ఆ కోతికి స‌లాం కొడుతున్నారు. ఈ త‌ల్లికి వంద‌నాలు అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


  


logo