శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 18, 2020 , 17:27:16

దూసుకొస్తున్న‌ చిరుత‌ల‌ను ఒక‌ అరుపుతో బెద‌ర‌గొట్టిన జిరాఫీ : వీడియో వైర‌ల్

దూసుకొస్తున్న‌ చిరుత‌ల‌ను ఒక‌ అరుపుతో బెద‌ర‌గొట్టిన జిరాఫీ :  వీడియో వైర‌ల్

ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నందా ట్విట‌ర్‌లో పోస్ట్ చేసే వీడియోల‌కు చాలా ప్ర‌త్యేక‌త ఉంటుంది. వ‌న్య‌ప్రాణులు, మూగ‌జీవాలు, ప‌క్షులు వాటిని ద‌గ్గ‌ర నుంచి చూసిన అనుభూతిని క‌లిగిస్తాయి అత‌ని వీడియోలు. ఈరోజు అలాంటి మ‌రొక వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో త‌ల్లి జిరాఫీ త‌న బిడ్డ‌ను చిరుత‌ల నుంచి కాపాడుకున్న‌ది. 33 సెకండ్ల‌పాటు న‌డిచే ఈవీడియోలో చుట్టూ మైదానం ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది.

దూరం నుంచి కొన్ని చిరుత‌లు జిరాఫీల‌ను స‌మీపిస్తున్నాయి. త‌ల్లి జిరాఫీ భ‌య‌ప‌డ‌కుండా బి‌డ్డ‌ను హ‌క్కున చేర్చుకుంది. చిరుత ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంటే పెద్ద గాండ్రింపుతో వాటిని భ‌య‌పెట్టింది. ఇన్ని చిరుత‌ల ఉన్న‌ప్ప‌టికీ ఆ త‌ల్లి జిరాఫీకి అంత ధైర్యం ఎలా వ‌చ్చిందో కానీ బిడ్డ‌ను మాత్రం ర‌క్షించుకున్న‌ది. బ‌హుశా త‌ల్లి ప్రేమ అలా ఉంటుంది. బిడ్డ ఆప‌ద‌లో ఉంటే ఎంతటి బ‌ల‌వంతుల్నైనా ఎదురించ‌గ‌ల‌వు. నందా పోస్ట్ చేసిన ఈ వీడియోకు నెటిజ‌న్లు ప్ర‌సంశ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.