మంగళవారం 07 జూలై 2020
National - Feb 24, 2020 , 12:45:03

మొతెరా హౌస్‌ఫుల్‌.. ఫొటోలు

 మొతెరా హౌస్‌ఫుల్‌.. ఫొటోలు

అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో ట్రంప్‌ దంపతులకు ప్రధాని నరేంద్రమోదీ ఘనస్వాగతం పలికారు.

అహ్మదాబాద్‌‌:  కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌.. మెల్‌బోర్న్‌లోని ఎంసీజీ.. ఈ  స్టేడియాల్లో క్రికెట్ మ్యాచ్ జ‌రిగిందంటే.. ప్రేక్ష‌కుల సంఖ్య‌ ల‌క్ష ఉండాల్సిందే.  ఇప్పుడు ఆ సంఖ్య‌ను దాటేసేందుకు కొత్త స్టేడియం త‌యారైంది.  అహ్మదాబాదఖలోని మొతెరా స్టేడియం.. మెగా స్టేడియంగా రూపుదిద్దుకున్న‌ది.  అంత‌ర్జాతీయ ప్రమాణాలతో నిర్మిత‌మైన ఈ స్టేడియంలో  జరగనున్న నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జనంతో మొతెరా  కిక్కిరిసి పోయింది.  రాజకీయ, సినీ, క్రీడారంగాలకు చెందిన ప్రముఖులు ఈవెంట్‌లో పాల్గొనేందుకు వచ్చారు.   1,10,000 మంది ప్రేక్ష‌కులు ఈ స్టేడియంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించ‌వ‌చ్చు. అగ్రరాజ్య అధినేత ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు కనీవినీ ఎరుగని  రీతిలో ఏర్పాట్లు చేశారు. ట్రంప్‌ రాక నేపథ్యంలో  అహ్మదాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో ట్రంప్‌ దంపతులకు ప్రధాని నరేంద్రమోదీ ఘనస్వాగతం పలికారు.

 ఎం.ఎస్‌ పాపుల‌స్ అనే  ఆర్కిటెక్ట్‌ సంస్థ ఈ స్టేడియాన్ని డిజైన్ చేసింది.  నిర్మాణం కోసం సుమారు 800 కోట్లు ఖ‌ర్చు చేశారు.  మెల్‌బోర్న్‌లోని ఎంసీజీ స్టేడియం కెపాసిటీ ల‌క్షా 24 సీట్లు. ఇప్పుడు ఆ సంఖ్య‌ను మొతెరా దాటేస్తుంది.  మొతెరాను స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ స్టేడియం అని కూడా పిలుస్తారు.  ఈ మైదానంలో మొత్తం 11 పిచ్‌లను తయారు చేశారు. ఈ స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 

భారీ వర్షం పడినా 30 నిమిషాల్లో మైదానం నుంచి నీరంతా  బయటకి పంపి మ్యాచ్‌కు సిద్ధం చేసేలా ఏర్పాట్లు చేశారు. 63 ఎకరాల విస్తీర్ణంలో స్టేడియాన్ని నిర్మించారు.   స్టేడియంలో మొత్తం 75 ఏసీ కార్పొరేట్ బాక్సులు, జీసీఏ స‌భ్యుల‌కు క్ల‌బ్ హౌజ్ ఉంటుంది.  ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్‌, జిమ్‌, పార్టీ ఏరియాలు ఉన్నాయి.  ఆటగాళ్ల కోసం ఇండోర్‌ నెట్స్‌, 6 ప్రాక్టీస్‌ పిచ్‌లు ఉన్నాయి.  స్డేడియంలో ఓ ఎంట్రీ వ‌ద్ద‌కు మెట్రో లైన్ నిర్మిస్తున్నారు.