గురువారం 28 మే 2020
National - May 08, 2020 , 19:31:43

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్ట‌ర్ బిల్లా అరెస్ట్‌

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్ట‌ర్ బిల్లా అరెస్ట్‌

చండీగ‌ఢ్‌:  మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్‌స్ట‌ర్ బ‌ల్జింద‌ర్ సింగ్ అలియాస్ బిల్లా‌, అత‌డి ఆరుగురు స‌హ‌చ‌రుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆధునిక ఆయుధాలు స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు.  హ‌త్య‌, ఆయుధాల అక్ర‌మ ర‌వాణా, మాద‌క ద్ర‌వ్యాల స్మ‌గ్లింగ్‌తో స‌హా 18 కేసులు నిందితుడిపై న‌మోదై ఉన్నాయ‌ని పంజాబ్ డీజీపీ దింక‌ర్ గుప్తి తెలిపారు. బిల్లాకు పాకిస్థాన్‌కు చెందిన ఖ‌లీస్తాన్ లిబ‌రేష‌న్ ఫోర్స్ చీఫ్ హ‌ర్మీత్ సింగ్ హ్యాపీతో, జ‌ర్మ‌నీకి చెందిన ఖ‌లిస్తాన్ జిందాబాద్ చీప్ బ‌గ్గాతో సంబంధాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు.

 ఆర్గ‌నైజేష‌న్ క్రైమ్ కంట్రోల్ యూనిట్‌, కౌంట‌ర్ ఇంటెలిజెన్స్ జ‌లంధ‌ర్ యూనిట్‌, క‌పుర్తాల పోలీసులు సంయుక్తంగా ఈ ఆప‌రేష‌న్ నిర్వ‌హించిన‌ట్లు వెల్ల‌డించారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో యూఎస్ సీక్రెస్ స‌ర్వీస్ సిబ్బంది ఉప‌యోగించే మూడు సావ‌ర్ పిస్ట‌ల్స్ కూడా ఉన్నాయి.  బిల్లాతో పాటు అరెస్ట్ అయిన మ‌రో ఆరుగురు నిందితులు సుఖ్జింద‌ర్ సింగ్, మోహిత్‌శ‌ర్మ‌, ల‌వ్‌ప్రీత్‌సింగ్‌, అలియాస్ ల‌వ్లీని గుర్తించారు. 


logo