గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 10:39:43

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌‌రో వాంటెడ్ క్రిమిన‌ల్ హ‌తం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌‌రో వాంటెడ్ క్రిమిన‌ల్ హ‌తం

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో నేర‌గాళ్ల ఏరివేత కొన‌సాగుతున్న‌ది. మూడు వారాల క్రితం గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబే మ‌ట్టుబెట్టిన పోలీసులు, ఈ రోజు మ‌రో వాంటెడ్ క్ర‌మిన‌ల్ టింకూ క‌పాలా ప‌నిప‌ట్టారు. శ‌నివారం తెల్ల‌వారుజామున బారాబంకి ప్రాంతంలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో క‌పాలా హ‌త‌మ‌య్యాడు. స్పెష‌ల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో టింకూ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడ‌ని, ద‌వాఖాన‌కు తీసుకువెళ్లేలోపు మ‌ర‌ణించాడ‌ని బారాబంకి ఎస్పీ అర‌వింద్ చ‌తుర్వేది వెల్ల‌డించారు. 

టింకూ క‌పాలా మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్ అని, అత‌ని త‌ప‌పై ల‌క్ష రూపాయాల రివార్డు ఉంద‌ని తెలిపారు.   logo