శుక్రవారం 05 జూన్ 2020
National - May 10, 2020 , 17:47:15

యూపీలో పేరు మోసిన నేర‌గాడు అరెస్ట్‌

యూపీలో పేరు మోసిన నేర‌గాడు అరెస్ట్‌

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఒక పేరు మోసిన నేరగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ‌నివారం రాత్రి అమ్రోహ జిల్లాలోని హ‌స‌న్‌పూర్ ఏరియాలో నేర‌‌గాడికి, పోలీసులకు మ‌ధ్య జ‌రిగిన కాల్పుల్లో అత‌డు గాయ‌ప‌డ్డాడు. అనంత‌రం పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకుని ఆస్ప‌త్రిలో చేర్పించారు. స‌ద‌రు నేర‌గాడి త‌ల‌పై 15,000 రివార్డు ఉంద‌ని, అత‌నిపై యూపీలోని వివిధ పోలీస్‌స్టేష‌న్ల‌లో 12 క్రిమిన‌ల్ కేసులు న‌మోదై ఉన్నాయ‌ని అమ్రోహ జిల్లా ఎస్పీ విపిన్ టాడా చెప్పారు. నిందితుడి కారు నుంచి ఒక తుపాకీ, కొన్ని క‌త్తులు, ఒక ఆవుదూడను స్వాదీనం చేసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. కారులో ఆవు దూడ‌ను ఎందుకు తీసుకెళ్తున్నాడ‌నే వివ‌రాలు తెలియాల్సి ఉంద‌న్నారు. 

 


logo