బుధవారం 03 జూన్ 2020
National - May 21, 2020 , 19:48:25

మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ అరెస్ట్‌

మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ అరెస్ట్‌

ఫరీదాబాద్‌: హర్యానా పోలీసులు ఓ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ను అరెస్ట్‌ చేశారు. నుహ్‌ జిల్లాకు చెందిన సదరు క్రిమినల్‌పై రూ.50 వేల రివార్డు ఉంది. క్రిమినల్‌ దగ్గరున్న దేశీయ పిస్తోల్‌తోపాటు 2 మందుగుండ్లను హర్యానా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్రిమినల్‌పై నుహ్‌, ఫరీదాబాద్‌ జిల్లాలో డజనుకుపైగా కేసులు నమోదై ఉన్నాయని, అతనిపై ఇప్పటికే  రూ.50 వేల రివార్డును ప్రకటించామని పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo