సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 23:12:39

వందేభారత్‌ మిషన్‌లో 8.14లక్షల మంది తరలింపు : కేంద్రమంత్రి

వందేభారత్‌ మిషన్‌లో 8.14లక్షల మంది తరలింపు : కేంద్రమంత్రి

న్యూఢిల్లీ : వందే భారత్‌ మిషన్‌ కింద ఇప్పటి వరకు 8.14లక్షల మంది భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి ఆదివారం తెలిపారు.  మే 6 నుంచి 8.14 లక్షల కంటే ఎక్కువగా మందిని వందేభారత్‌ కింద తరలించామని, 2.70లక్షల మంది 53 దేశాల నుంచి తిరిగి వచ్చారని ట్వీట్‌ చేశారు. ఆగస్టు 1 నుంచి ఫేజ్-5‌ను అమలు చేస్తూ.. ఎక్కువ మంది భారతీయ పౌరులను తిరిగి తీసుకువచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందని తెలిపారు. యునైటెడ్‌ స్టేట్స్‌, కెనడా, ఖతార్‌, ఒమన్‌, యూఏఈ, సింగపూర్‌, యూకే, ఫ్రాంక్‌ఫర్ట్‌, పారిస్‌, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌, న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌ వంటి దేశాలను కలుపుతూ మిషన్‌ కొనసాగుతుందని చెప్పారు. టికెట్ బుకింగ్‌ తదితర వివరాలను త్వరలో ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఇతర విమానయాన సంస్థలు పంచుకుంటాయని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, ఓపిక పట్టాలని కేంద్రమంత్రి కోరారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo