బుధవారం 08 జూలై 2020
National - Jun 14, 2020 , 19:29:53

కరోనా విజృంభిస్తున్నా.. బిహార్‌లో ఎన్నికలపై చర్చలు : ప్రశాంత్‌ కిశోర్‌

కరోనా విజృంభిస్తున్నా.. బిహార్‌లో ఎన్నికలపై చర్చలు : ప్రశాంత్‌ కిశోర్‌

పాట్నా : ఓ వైపు దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. బిహార్‌లో మాత్రం ఎన్నికల ప్రచారానికి తెరతీస్తున్నారంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ట్విట్టర్‌ వేదికగా తప్పుపట్టారు. ఈ ఏడాది నవంబర్‌లో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, బిహార్‌లో అతితక్కువగా టెస్ట్‌లు చేస్తున్నా 6వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదైన పరిస్థితుల్లో కరోనా వైరస్‌ నియంత్రణను పక్కనపెట్టి బిహార్‌లో ఎన్నికలపై చర్చలు జరుపుతున్నారని విమర్శించారు. కరోనా వైరస్‌ భయంతో ఇంటికే పరిమితమైన నితీశ్‌కుమార్‌ ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయటకు వస్తే.. ప్రజలు మాత్రం వైరస్‌కు గురికారని ఆలోచిస్తున్నారంటూ ఆదివారం హిందీలో వరుస ట్వీట్లు చేశారు. ప్రశాంత్‌ కిశోర్‌ కొద్దికాలం పాటు జనతాదళ్‌(యూ)లో పని చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా కేంద్రం లాక్‌డౌన్‌ విధించినా నితీశ్‌కుమార్‌ ఒక్కసారి కూడా మహమ్మారిపై ప్రజలను ఉద్దేశించి మాట్లాడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.


logo