బుధవారం 27 మే 2020
National - May 10, 2020 , 02:05:51

మహారాష్ట్రలో 20 వేలు దాటిన కేసులు

మహారాష్ట్రలో 20 వేలు దాటిన కేసులు

ముంబై: మహారాష్ట్రలో శనివారం కొత్తగా 1,165 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 48 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో 27 మంది ముంబై వాసులు కాగా, తొమ్మిది మంది పుణె నగర వాసులు, ఎనిమిది మంది నాసిక్‌ జిల్లాలోని మాలేగావ్‌ నివాసులు, పుణె, అకోలా, నాందేడ్‌, అమరావతి జిల్లాల వారు ఒక్కొక్కరు ఉన్నారు. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,228కి, మరణాలు 779కి చేరాయి. ముంబై పరిధిలో 12,864 మంది కరోనాతో బాధపడుతుండగా, 489 మంది మరణించారు. పుణెలో 141 మరణాలు సంభవించాయి. 2,27,804 మందిని పరీక్షించగా, 2,41,290 మందిని హోం క్వారంటైన్‌ చేశారు.


logo