గురువారం 28 మే 2020
National - May 22, 2020 , 16:58:50

నాలుగో రోజూ ల‌క్ష మందికి క‌రోనా ప‌రీక్ష‌లు..

నాలుగో రోజూ ల‌క్ష మందికి క‌రోనా ప‌రీక్ష‌లు..


హైద‌రాబాద్‌: వ‌రుస‌గా నాలుగ‌వ రోజు కూడా ల‌క్ష మందికిపై క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు ఐసీఎంఆర్ డాక్ట‌ర్ ర‌మ‌న్ గంగాఖేద్క‌ర్ తెలిపారు. ఇవాళ మీడియాతో ఆయ‌న మాట్లాడారు.  ఇవాళ మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు 27,55,714 మందికి కోవిడ్‌19 ప‌రీక్ష‌లు చేప‌ట్టిన‌ట్లు ఆయ‌న చెప్పారు. 18287 మందికి ప్రైవేటు ల్యాబ్‌ల్లో ప‌రీక్ష‌లు చేశార‌న్నారు. ఆయుస్మాన్ భార‌త్ స్కీమ్ కింద కోటి మందికి చికిత్స చేయ‌డం అరుదైన ఘ‌న‌త అని వీకే పౌల్‌ తెలిపారు. ఒక‌వేళ లాక్‌డౌన్ అమ‌లు చేయ‌కుండా ఉంటే, మ‌ర‌ణాలు ఎక్కువ స్థాయిలో న‌మోదు అయి ఉండేవ‌న్నారు. పాజిటివ్ కేసులు పెరిగినా, కోవిడ్‌19 మ‌ర‌ణాలు మాత్రం త‌గ్గిన‌ట్లు తెలిపారు. 


logo