సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 11:07:24

అయోధ్య రామాలయానికి మొరారి బాపు రూ.5కోట్ల విరాళం

అయోధ్య రామాలయానికి మొరారి బాపు  రూ.5కోట్ల విరాళం

న్యూఢిల్లీ:  ఉత్తర్‌ప్రదేశ్‌లోని  అయోధ్యలో     రామమందిర నిర్మాణానికి భారీగా విరాళాలు వస్తున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపు   భారీ స్థాయి రామాలయ  నిర్మాణానికి రూ.5కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఆయన  ఆధ్వర్యంలోని  వ్యాస్‌పీఠ్‌ నుంచి శ్రీరామ్‌ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌కు విరాళాన్ని అందజేయనున్నట్లు  తెలిపారు.  

పట్నాలోని  మహవీర్‌ మందిర్‌ ట్రస్టు రూ.10కోట్ల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.  ఆగస్టు 5న అయోధ్యలో రామాలయానికి ప్రధాని నరేంద్రమోదీ పునాదిరాయి వేయనున్నట్లు ఆలయ ట్రస్ట్‌ అధ్యక్షుడు మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌  తెలిపారు. వెండి ఇటుకతో ప్రధాని   రామాలయానికి శంకుస్థాపన చేయనున్నారు.  కాశీ నుంచి వచ్చే ఐదుగురు పురోహితులు భూమి పూజ నిర్వహించనున్నారు. 


logo