గురువారం 04 మార్చి 2021
National - Jan 24, 2021 , 23:56:00

సీబీఐకి సోలార్ స్కాం ద‌ర్యాప్తు: ‌విజ‌య‌న్ స‌ర్కార్ నిర్ణ‌యం

సీబీఐకి సోలార్ స్కాం ద‌ర్యాప్తు: ‌విజ‌య‌న్ స‌ర్కార్ నిర్ణ‌యం

తిరువ‌నంత‌పురం: ఈ ఏడాది చివ‌రిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో సోలార్ స్కామ్ కేసుల ద‌ర్యాప్తును సీబీఐకి బ‌దిలీ చేయాల‌ని కేర‌ళ‌లోని ఎల్డీఎఫ్ స‌ర్కార్ నిర్ణ‌యించింది. మాజీ సీఎం ఉమెన్ చాందీతోపాటు మ‌రో ఐదుగురిపై లైంగిక దాడి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. పిన‌రాయి విజ‌య‌న్ సార‌థ్యంలోని కేర‌ళ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం పూర్తిగా రాజ‌కీయ వేధింపుల్లో భాగ‌మేన‌ని ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న‌ది. 

గ‌త ఐదేండ్లుగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ స‌ర్కార్‌.. ఈ కుంభ‌కోణంలో వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్లో ఒక్క‌టి కూడా రుజువు చేయ‌లేక‌పోయింద‌ని పేర్కొంది. ఎన్నిక‌ల ముంగిట్లోనే ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ద‌ని స్ప‌ష్టం చేసింది. తాను ఎటువంటి ద‌ర్యాప్తును ఎదుర్కొనేందుకైనా సిద్ధ‌మేన‌ని ఉమెన్ చాందీ ప్ర‌క‌టించారు. 

కేంద్రంతో క‌లిసి అధికారం పంచుకునేందుకు పిన‌రాయి విజ‌య‌న్ స‌ర్కార్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఉమెన్ చాందీ ఆరోపించారు. నాన్ బెయిల‌బుల్ సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసినా దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం ఎందుకు చ‌ర్య తీసుకోలేక‌పోయింద‌ని ప్ర‌శ్నించారు. ఇప్పుడు సీబీఐకి అప్ప‌గించాల్సిన అవ‌స‌రం ఏమిట‌ని నిల‌దీశారు. రాష్ట్ర ప్ర‌జ‌లు అంతా గ‌మ‌నిస్తున్నార‌ని చెప్పారు. కేంద్ర మంత్రి వీ ముర‌ళీధ‌రన్ సైతం రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టారు. ఎన్నిక‌లు ముంగిట్లో ఉన్నందున సోలార్ స్కాంపై ద‌ర్యాప్తును రాష్ట్ర ప్ర‌భుత్వం సీబీఐకి సిఫార‌సు చేసింద‌న్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo