గురువారం 02 జూలై 2020
National - Jun 24, 2020 , 14:53:33

ఢిల్లీలో వర్షాలు.. ఆరెంజ్‌ హెచ్చరిక జారీ

ఢిల్లీలో వర్షాలు.. ఆరెంజ్‌ హెచ్చరిక జారీ

ఢిల్లీ: అనుకూల పరిస్థితుల కారణంగా రుతుపవనాల కోసం ఢిల్లీ ప్రజల నిరీక్షణ ముగిసింది. వర్షాకాలం జూన్ 27 న ఢిల్లీకి చేరుకుంటుందని ఊహించినప్పటికీ బుధవారం నుంచే వర్షాలు కురవడం మొదలైంది. ఢిల్లీలో రుతుపవనాల రాకతో వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది.

ఢిల్లీలో మంగళవారం రోజంతా మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. కొన్ని సమయాల్లో వర్షం పడే అవకాశాలు కనిపించినప్పటికీ గాలి బాగా వీయడంతో వర్షం కనుమరుగైంది. ఢిల్లీ గరిష్ట ఉష్ణోగ్రత మంగళవారంకన్నా రెండు డిగ్రీలు తక్కువగా 37.0 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. కనిష్ట స్థాయి 27.8 డిగ్రీల సెల్సియస్. మేఘావృత పరిస్థితులు కారణంగా తేలికపాటి నుంచి భారీ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ బుధవారం అంచనా వేసింది. ఈసారి మామూలు కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆనంద్ శర్మ తెలిపారు. రుతుపవనాలు ఢిల్లీ చేరుకొన్నాయని స్కైమెట్‌ వెదర్‌ సంస్థ ప్రకటించింది. ఉదయం నుంచి మేఘావృతమై ఉండి, రాత్రి 11 గంటల తరువాత వర్షం ప్రారంభమైంది. వాతావరణ శాఖ ప్రకారం, జమ్ముకశ్మీర్‌,

రాజస్థాన్, పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో మంచి వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ హిమాలయ ప్రాంతం, హర్యానా, చండీగఢ్‌, పంజాబ్, రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలతో సహా ఢిల్లీ వైపు రుతుపవనాలు కదులుతున్నాయి. వచ్చే 4-5 రోజుల్లో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.


logo