బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 21:01:18

‘అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేయాలి’

‘అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేయాలి’

సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత ముఖేశ్‌ అగ్నిహోత్రి శనివారం డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని చాలా విషయాలు, సమస్యలపై చర్చించాల్సి ఉన్నందున ప్రభుత్వం సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. వందలాది మంది హాజరయ్యేలా యజ్ఞం నిర్వహించగలిగిన సీఎం ఆదిత్యనాథ్‌ అసెంబ్లీ సమావేశాలు ఎందుకు నిర్వహించలేరని ప్రశ్నించారు. రాష్ట్ర సచివాలయంలో శుక్ర, శనివారాల్లో ప్రజాపద్దులు, అంచనాలు, పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌, సంక్షేమ కమిటీల సమాశాలను నిర్వహించారు. 


logo